: స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన కేశినేని నాని


ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ అంశాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తారు. గతంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని... ఆ తర్వాత నీతి అయోగ్ ఒప్పుకోలేదంటూ దాన్ని పక్కన పెట్టేశారని ఈ సందర్భంగా కేశినేని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారని... అయితే, ఎప్పట్లోగా ఆ ప్యాకేజీ ఇస్తారో చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశ్నించారు. రెండు నెలలు దాటిపోయినా ఈ ప్యాకేజీపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని అన్నారు. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News