: చిత్ర ప్రదర్శనకు ముందు సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలి: సుప్రీంకోర్టు
దేశభక్తి, జాతీయతా భావాలు ప్రతి పౌరుడిలో నిండి ఉండాలంటే జాతీయగీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. దేశం పట్ల ఆరాధనా భావం, పూజనీయమైన భావం పెరిగేలా చేసే మన దేశ జాతీయగీతం ఇకపై ప్రతిరోజు సినిమా హాళ్లలో వినబోతున్నాం. జాతీయగీతంపై ఈ రోజు సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సినిమా థియేటర్లో చిత్ర ప్రదర్శనకు ముందు తప్పని సరిగా జాతీయగీతాన్ని ప్రసారం చేయాలని పేర్కొంది. జాతీయగీతం, జాతీయ జెండాను ప్రతి ఒక్కరు గౌరవించాలని స్పష్టం చేసింది. దీంతో, ఇకపై విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జనగణమన అధినాయక జయ హే భారత భాగ్యవిధాతా!' గీతం ప్రతి థియేటర్లలోనూ వినపడనుంది. సినిమాలే లోకంగా బతుకుతున్న వారి మదిలో సుప్రీం జారీ చేసిన ఈ ఆదేశాలతో జాతీయతా భావం పెరుగనుంది.