: రాజ్యసభలో పోడియం వద్దకు దూసుకొచ్చి నినాదాలు చేసిన విపక్ష సభ్యులు... వాయిదా
ఈ రోజు ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు, నగ్రొటాలో సైనికులపై దాడి అంశాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో వీరమరణం పొందిన సైనికులతో పాటు నోట్ల రద్దు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కూడా సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడుల అంశాన్ని రాజకీయం చేయకూడదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సభలో ఏ అంశం గురించైనా చర్చించడానికి సిద్ధమేనని చెప్పారు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.