: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... చెన్నైకి భారీ వర్ష సూచన


ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 830 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయిందని... పశ్చిమ దిశగా అది పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో ఇది తుపానుగా మారనుందని... దీని ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. డిసెంబర్ 2వ తేదీన కడలూరు సమీపంలో తుపాను తీరం దాటనుందని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, కారైకల్ ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

  • Loading...

More Telugu News