: మొబైల్ బ్యాంకింగ్ అలవాటు చేసుకోండి: ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో ఏర్పడిన నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఈ రోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొబైల్ బ్యాంకింగ్ అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలోని రేషన్ డిపోలన్నింటిలో బియ్యంతో పాటు అన్ని సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచి విక్రయించాలని, విలేజ్ మాల్స్ మాదిరిగా అవి పనిచేయాలని అన్నారు. బ్యాంకుల మధ్య అంతర్గత సమన్వయం పెరగాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ చర్యలు చేపట్టేలా అధికారులు పని చేయాలని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు అలవాటుగా మారాలని అన్నారు. డిసెంబరు 5 లోపు అన్ని జన్‌ధన్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని చెప్పారు.