: కేవలం మూడు రోజుల్లో లక్ష ఐఫోన్లు అమ్మిన ఆపిల్
పెద్ద నోట్ల రద్దుతో భారత్ లో వ్యాపార రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణాల్లో ఆన్ లైన్ షాపింగ్ శాతం పెరగగా, ఈ కామర్స్ రంగం కుదేలైంది. క్యాష్ ఆన్ డెలివరీలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పెద్దనోట్లు మార్చుకోగల వెసులుబాటు కలిగిన రోజుల్లో యాపిల్ ఐఫోన్ వ్యాపారం పుంజుకుందని ఆ సంస్థ ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దైన తొలి మూడు రోజుల్లో సుమారు లక్ష యాపిల్ ఐఫోన్లను అమ్మినట్టు ఆ సంస్థ ప్రకటించింది. అందులో కూడా ఐఫోన్ 7 మోడల్ ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడ్డారని ఆ సంస్థ తెలిపింది. కాగా, పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన రోజు అర్ధరాత్రి ముగిసినా ఈ సంస్థ షోరూంలు తెరిచి ఉంచడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయని, దీంతో వెంటనే పలువురు యాపిల్ ఐఫోన్ మోడల్ 7ను భారీఎత్తున కొనుగోలు చేశారని ఆ సంస్థ ఉద్యోగి ఒకరు తెలిపారు.