: విపక్షాల ఆందోళన మధ్యే ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆదాయ పన్ను చట్ట సవరణ కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు(ది టాక్సేషన్ లా.. సెకండ్ అమెండ్ మెంట్-2016)కు ఈ రోజు ఆమోదం లభించింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగం తరువాత మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మరోవైపు బిల్లు ఆమోదం పొందే సమయంలో విపక్ష సభ్యులు బిల్లుపై ఓటింగ్ కోసం నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యే బిల్లు ఆమోదం పొందింది. అనంతరం లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు. రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై ప్రధానిమోదీ సమాధానం చెప్పాలంటూ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.