: ప్రజల అసహనం... అమరావతి ఆంధ్రా బ్యాంకుపై దాడి, అద్దాలు ధ్వంసం


బ్యాంకుల ముందు డబ్బు కోసం 20 రోజులుగా పడిగాపులు పడుతున్న ప్రజల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోందనడానికి ఇది మరో ఉదాహరణ. ఈ ఉదయం గుంటూరు జిల్లాలోని అమరావతి ఆంధ్రా బ్యాంకు వద్ద గంటల కొద్దీ క్యూలైన్లలో అవస్థలు పడుతున్న వారి పట్ల బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, ప్రజలు బ్యాంకుపై దాడికి దిగారు. తమకు వెంటనే డబ్బు చెల్లించాలంటూ, బ్యాంకులోకి ప్రవేశించి అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ప్రజలను అక్కడి నుంచి పంపేశారు. మరోవైపు పత్తిపాడులోనూ బ్యాంకుల సిబ్బంది ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ, ఖాతాదారులు నిరసనలకు దిగారు.

  • Loading...

More Telugu News