: ఫుట్ బాల్ ఆటగాళ్ల విమానం క్రాష్... మృత్యుంజయులూ ఉన్నారు!


ఈ ఉదయం బ్రెజిల్ ఫుట్ బాల్ టీముతో సహా 81 మందితో ప్రయాణిస్తూ, మెడిలిన్ నగరం సమీపంలో క్రాష్ ల్యాండింగ్ అయిన విమానంలో కొందరు మృత్యుంజయులూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విమానం తొలి చిత్రాలు బయటకు రాగా, విమానాశ్రయానికి కొంత దూరంలో క్రాష్ ల్యాండింగ్ జరుగగా, విమానం నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం, విమానం కూలిన తరువాత ప్రాణాలను నిలుపుకున్న వారు కొందరు ఉన్నారు. బొలీవియా నుంచి బయలుదేరిన ఈ చార్టెడ్ విమానంలో చాపెకోయిన్సీ ఫుట్ బాల్ టీమ్, ఎయిర్ పోర్టు అధికారులు ఉన్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగివుంటే, బుధవారం నాడు కోపా సుడామెరికానా ఫుట్ బాల్ పోటీల ఫైనల్ పోరులో భాగంగా మెడిలిన్ జట్టుతో చాపెకోయిన్సీ ఆడాల్సి వుంది. విమాన ప్రమాదంలో మృతులు, మృత్యుంజయుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News