: మిగతా కంపెనీలకు 12 ఏళ్లు పడితే... జియో 3 నెలల్లోనే సాధించింది


ఉచిత కాలింగ్, ఉచిత డేటా ఆఫర్లతో రిలయన్స్ జియో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. మూడు నెలల్లో (83 రోజులు) 5 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది. ఈ మైలురాయిని దాటడానికి టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కు 12 ఏళ్లు పట్టింది. ఐడియా, వొడాఫోన్ లకు 13 సంవత్సరాలు పట్టింది. ప్రతి రోజు సగటున 6 లక్షల మంది కస్టమర్లను జియో సొంతం చేసుకుంటోంది. అంటే, నిమిషానికి వెయ్యి మంది కొత్త కస్టమర్లు అన్నమాట. మరోవైపు, తమ ఉచిత ఆఫర్ ను 2017 మార్చి వరకు జియో పొడిగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News