: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. దీంతో స్పందించిన ఆర్మీ తిరిగి కాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఉదయం 5.30 గంటల సమయంలో జమ్ములోని నగ్రొట్టా సమీపంలోని ఆర్మీ యూనిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. గ్రనేడ్లు విసురుతూ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరుగుతుండడంతో అధికారులు నగ్రొటాలోని స్కూళ్లను మూసివేశారు.