: మా దేశంలో రాందేవ్ బాబా 150 కోట్ల అక్రమ పెట్టుబడులు పెట్టారు: నేపాల్ మీడియా


ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద గ్రూప్ ప్రొమోటర్ రాందేవ్ బాబా నేపాల్‌ లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని ఆ దేశ మీడియా కథనాలు ప్రసారం చేసింది. రాందేవ్ బాబా సుమారు 150 కోట్ల రూపాయలకుపైగా అక్రమ పెట్టుబడులు పెట్టినట్లు నేపాల్ మీడియా ఆరోపించింది. ఈ నిధులన్నీ విదేశీ పెట్టుబడులు, టెక్నాలజీ ట్రాన్స్‌ ఫర్ చట్టానికి వ్యతిరేకంగా పతంజలి యోగాపీఠ్ ట్రస్ట్ పేరుతో పెట్టారని మీడియా తెలిపింది. నేపాల్‌‌ ప్రముఖ వ్యాపారవేత్త మహతో పేరుతో రిజిష్టర్ అయిన పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా అక్రమమేనని ఆరోపించింది. యోగాపీఠ్ ట్రస్ట్ పేరుతో పలు ప్రాజెక్టులు కూడా పతంజలి సంస్థ చేపట్టిందని నేపాల్ మీడియా తెలిపింది. కాగా, నేపాల్ మీడియా ఆరోపణలను రాందేవ్ బాబా ఖండించారు. నేపాల్లో తాము ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. తాము పతంజలి యోగాపీఠ్ ద్వారా పెట్టుబడులు పెట్టాలనుకుంటే నేపాల్ ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News