: సీఎం రమేష్ తో మైసూరా మంతనాలు...జంపింగేనా?
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తో వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మైసూరా మళ్లీ టీడీపీలో చేరుతున్నారంటూ గతంలో వార్తలు వినపడ్డాయి. అయితే వాటిని ఆయన ఖండించినప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడపజిల్లా ఎర్రగుంట్లలో మైసూరాను టీడీపీ నేత సీఎం రమేష్ కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారా? అన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కాగా, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైసూరారెడ్డిని సీఎం రమేష్ కలిసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు మైసూరాను కలిసిన సమయంలో సీఎం రమేష్ వెంట ఉండడం విశేషం. అనంతరం సీఎం రమేష్, మైసూరాతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.