: మా నాన్న అంటే చచ్చేంత భయం: అమీర్ ఖాన్


‘మా నాన్న హిట్లర్ కంటే చాలా డేంజర్, ఆయన అంటే చచ్చేంత భయం’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ అన్నాడు. తన తాజా చిత్రం ‘దంగల్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ను ఒక అభిమాని ప్రశ్నించగా పైవిధంగా సమాధానం ఇచ్చాడు. ‘దంగల్’ చిత్రంలో ‘హాని కారక్ బాపు’ అనే పాట ఇటీవల విడుదలైంది. హీరో తన కుమార్తెలను ఉదయాన్నే లేపి జాగింగ్, వ్యాయామం, నదిలో ఈతకొట్టించడం లాంటివి చేయిస్తుండటంతో వారు అవస్థ పడుతుండటాన్ని నేపథ్యంగా ఈ పాట చిత్రీకరించారు. ఈ నేపథ్యంలోనే ‘నిజజీవితంలోనూ మీ పిల్లలతో మీరు ఇంతే కఠినంగా ఉంటారా?’ అని ఆ అభిమాని ప్రశ్నించాడు. అమీర్ స్పందిస్తూ..‘ నేను అలా ఉండను కానీ, మా నాన్న హిట్లర్ కంటే చాలా డేంజర్. మాకు ఆయనంటే చాలా భయం’ అని సమాధానమిచ్చాడు. ఈ కాలంలో పిల్లలు ఏమవ్వాలని అనుకుంటున్నారో వారే నిర్ణయించుకుంటున్నారని, వారిని సపోర్ట్ చేస్తే చాలని, వారు ఎంచుకున్న రంగంలో లాభనష్టాల గురించి వారికి వివరించాలని అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News