: కరుడుగట్టిన ఖలిస్థాన్ ఉగ్రవాది మింటూ ఇలా దొరికాడు!


నిన్న ఉదయం పాటియాలా జైలు నుంచి తప్పించుకుని నేడు ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన హర్మీందర్ సింగ్ మింటూ, తాను చేసిన చిన్న తప్పు కారణంగానే పోలీసులకు పట్టుబడిపోయాడు. తప్పించుకున్న తరువాత ఢిల్లీకి వచ్చిన ఆయన సుభాష్ నగర్ లోని తన బంధువుల ఇంటికి ఫోన్ చేసి మాట్లాడటమే మింటూను పట్టిచ్చింది. అప్పటికే ఆయన బంధువులు, మిత్రులందరి ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు మింటూ మాట్లాడిన కాల్ ను ట్రేస్ చేసి, ఆపై ఆయన అక్కడికే వస్తున్న విషయం పసిగట్టి అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అరెస్ట్ చేసిన మింటూను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై ట్రాన్సిట్ రిమాండ్ పై పంజాబ్ పోలీసులకు అప్పగిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News