: హైదరాబాద్ లో ‘మెట్రో స్మార్ట్ కార్డు’ రాబోతోంది!
హైదరాబాద్ లో అన్ని రవాణా సాధనాల్లో చెల్లుబాటయ్యేలా ‘మెట్రో స్మార్ట్ కార్డు’ త్వరలో రాబోతుంది. ఈ కార్డును తీసుకువచ్చేందుకు హెచ్ఎంఆర్, ఎల్ అండ్ టీ వేర్వేరు బ్యాంకులు, సంస్థలతో చర్చలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ ‘మెట్రో’ రైలు ప్రారంభంతోనే ఈ కార్డు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న హైదరాబాద్ ‘మెట్రో’ రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం టికెటింగ్ వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలను పరిచయం చేయనున్నారు. ఈ కార్డును మెట్రో’లోనే కాకుండా, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి రవాణా సాధనాలతో పాటూ పార్కింగ్, షటిల్ బస్సులు, క్యాబ్స్, ఆటో ఇలా అన్నిచోట్లా చెల్లుబాటు అయ్యేలా సంప్రదింపులు జరుగుతున్నాయి.