: క్రెడిట్ కార్డు ఎక్కడ పోయిందా అని వెతికేలోపే 19 సార్లు వాడేశారు: నటి ఆలియా భట్ తల్లి
క్రెడిట్ కార్డు ఎక్కడ పోయిందా అని ఆలోచించే లోపే నిందితులు ఆ కార్డును 19 సార్లు వాడేశారని బాలీవుడ్ యువ నటి ఆలియా భట్ తల్లి, నాటి నటి సోనీ రాజ్దాన్ చెప్పారు. ఈ విషయమై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఆమె తన రెండో కుమార్తె షహీన్ తో కలిసి ముంబయిలో బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి క్రెడిట్ కార్డు మాయమవడంతో, అది ఎక్కడ పోయిందా అని చూసుకునే లోపే ఆ కార్డును 19 సార్లు వాడేశారని చెప్పారు. చోరీకి గురైన కార్డును తాను ఎక్కువగా వాడనని, ఆ కార్డు ఎప్పుడూ తన పర్సులోనే ఉంటుందని పేర్కొన్నారు. తన కార్డును దొంగిలించిన వారు దానిని ఉపయోగించిన ప్రతిసారీ, తనకు మెసేజ్ లు వస్తుండటంతో అసలు విషయం తనకు తెలిసిందని చెప్పారు. వెంటనే సదరు బ్యాంక్ కు ఫోన్ చేసి కార్డు బ్లాక్ చేయించానని, తాను వెంటనే స్పందించకపోతే చాలా నష్టపోవాల్సి వచ్చేదానినని సోనీ రాజ్దాన్ చెప్పారు.