: హాంగ్ కాంగ్ ఓపెన్ లో సింధు ఓటమి
హాంగ్ కాంగ్ ఓపెన్ ఫైనల్లో పివి సింధు ఓటమి పాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తయ్ జు చేతిలో వరుస రౌండ్లలో సింధు ఓడిపోయింది. తొలి రౌండ్, రెండో రౌండ్ లోనూ వరుసగా 15-21,17-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. తొలిరౌండ్ లో ఒక దశలో 6-6 స్కోరుతో సమానంగా ఉన్న దశలో, తైపీ క్రీడాకారిణి వరుస పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లి తొలి సెట్ ను సొంతం చేసుకుంది. రెండో రౌండ్ లో ఇద్దరు క్రీడాకారిణులు పోటీ పడి ఆడి 10-10 స్కోరును సమం చేశారు. అయితే, తయ్ జు దూసుకెళ్లింది. అనంతరం పుంజుకున్న సింధు 16-18తో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, తయ్ జు మెరుగైన ఆటతీరుతో ఆ సెట్ నూ సొంతం చేసుకుంది.