: ఎడ్ల బండెక్కి కిందపడ్డ ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో ఆదివారం నాడు జరిగిన జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఓ ఎడ్ల బండిని మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు ఎక్కి యాత్రలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తుండగా, బండి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో అయ్యన్నపాత్రుడు, పీలా గోవింద్ లు కిందపడ్డారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, తెలుగుదేశం నేతలు వెంటనే స్పందించి వీరిని లేపారు. ఈ ఘటనతో ర్యాలీకి కొంత అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సి వుంది.