: పంజాబ్ జైలుపై ఆయుధాలతో దాడి... తప్పించుకున్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్, మరో నలుగురు తీవ్రవాదులు
పంజాబ్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే నభా జైలుపై 10 మంది సాయుధులైన దుండగులు దాడి చేసి, జైల్లో ఉన్న నలుగురు తీవ్రవాదులను విడిపించుకుపోయారు. ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ తో పాటు మరో నలుగురిని సాయుధులు తీసుకెళ్లారు. వీరిలో గ్యాంగ్ స్టర్లుగా, ఎన్నో నేరాలు చేసి రికార్డులకు ఎక్కిన గురు ప్రీత్ సింగ్, వికీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్ జిత్ సింగ్ లు ఉన్నారు. పారిపోయిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. జైలు సిబ్బందిపై తుపాకులు గురిపెట్టిన దుండగులు వీరిని విడిపించుకుని పోయినట్టు తెలుస్తోంది.