: ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికే మోదీ కన్నీళ్లు పెడుతున్నారు: మాయావతి


దేశ ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రధాని మోదీ కన్నీళ్లు పెడుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే మోదీ పెద్దనోట్లు రద్దు చేశారని అన్నారు. దేశ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్న మోదీ పార్లమెంటులో విపక్షాలతో మాట్లాడేందుకు మాత్రం జంకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా ఏర్పడిన ఆర్థిక ఎమర్జన్సీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తాము రాజకీయ లబ్ధి కోసం గాక దేశ ప్రయోజనాల దృష్ట్యా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ముందే బ్లాక్ మనీ సర్దుకున్నారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News