: పాక్ కొత్త ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా


రాహిల్ షరీఫ్ స్థానంలో పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా ఖమర్ జావెద్ బజ్వా నియమితులు కానున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఖమర్ జావెద్ బజ్వా 'పీఓకే'లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ నెల 29తో రాహిల్ షరీఫ్ పదవీ కాలం ముగియనుండడంతో ఆయన స్థానంలో పాకిస్ధాన్ ఆర్మీ చీఫ్ గా ఖమర్ జావెద్ బజ్వా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, యూరీ ఉగ్రదాడి అనంతరం ఆర్మీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంతో ఆర్మీ చీఫ్ బాధ్యతల్లో కొనసాగేందుకు రాహిల్ షరీఫ్ అంగీకరించలేదు. దీంతో కొత్త ఆర్మీ చీఫ్ ను నియమిస్తూ నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News