: హైదరాబాద్‌ ప్రజల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది.. నగదు సమస్య లేదు!: ప్రధాని సోదరుడి చిత్రమైన వ్యాఖ్యలు


జ‌నంతో కిక్కిరిసి పోయి క‌నిపించే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏటీఎంల‌లో డ‌బ్బు పెట్టిందే ఆల‌స్యం.. వెంట‌నే ఖాళీ అయిపోతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని ఏటీఎంల‌లో 2000 రూపాయ‌ల‌ నోటుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్లు ఇంకా ఇన్‌స్టాల్ కాలేదు. ఎన్నో ఏటీఎంలలో 500, 100 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ప‌రిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ హైద‌రాబాద్‌లో న‌గ‌దు కొర‌త ఉన్న‌ట్లు త‌న‌కు అనిపించ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. న‌గ‌రంలో జ‌రుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ రోజు ఉద‌యం మీడియాతో మాట్లాడుతూ.. న‌గ‌రంలో ఎక్కడా న‌గ‌దు సమస్య ఉన్నట్లు లేదని, ఎవరి ముఖాలు చూసినా ఎంతో ఆనందంగా ఉన్న‌ట్లు కనపడుతున్నారని, దీనిని బ‌ట్టే తాను ఇలా అనుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News