: మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌పై రెచ్చిపోయిన యువ‌తి... జూబ్లీహిల్స్‌లో ఘ‌ట‌న‌


మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ యువ‌తి పోలీసుల‌పై విరుచుకుప‌డింది. త‌న‌ను ఎందుకు ఆపారంటూ నిల‌దీసింది. శాంపిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. శుక్ర‌వారం రాత్రి హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీసులు ప‌లుచోట్ల డ్రంకెన్ డ్రైవ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్యం తాగి డ్రైవ్ చేస్తున్న 149 మందిపై కేసులు న‌మోదు చేసి వాహ‌నాలు సీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్‌లో మ‌ద్యం తాగి వేగంగా దూసుకుపోతున్న మ‌హిళ‌ను ఆపి శ్వాస పరీక్ష కోసం శాంపిల్ ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. దీంతో ఆమె రెచ్చిపోయింది. పోలీసుల‌ను దుర్భాషలాడింది. ఆమెతో ఉన్న స్నేహితులు కూడా పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. పోలీసులు యువ‌తిపై కేసు న‌మోదు చేశారు.

  • Loading...

More Telugu News