: హైటెక్ సిటీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. 10 కార్లు ద‌గ్ధం


హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. హైటెక్ సిటీ స‌మీపంలోని ఫ్లాగ్ ఆటో గ్యారేజ్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో ప‌ది కార్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే మూడు అగ్నిమాప‌క శకటాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌లను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నించాయి. పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డుతున్న మంట‌ల‌ను అదుపు చేసేందుకు సిబ్బంది క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగి ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో ఆస్తి నష్టం భారీగా జ‌రిగిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News