: సైరస్ మిస్త్రీకి మరో షాక్ ..టాటా స్టీల్ ఛైర్మన్ పదవి నుంచి కూడా ఉద్వాసన!
'టాటా సన్స్' చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలుకుతూ కొన్ని రోజుల క్రితం ఆ సంస్థ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. ఈ రోజు టాటా స్టీల్ ఛైర్మన్ పదవి నుంచి కూడా ఆయనకు ఉద్వాసన పలికారు. ఇకపై ఆ బాధ్యతలను గతంలో ఎస్బీఐ ఛైర్మన్గా పనిచేసిన ఓపీ భట్ చేపట్టనున్నారు. మరోవైపు ఈ అంశంపై మరిన్ని చర్చలు జరిపి, నస్లీ వాడియాను టాటా స్టీల్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు వచ్చే నెల 21వ తేదీన ఈజీఎం భేటీ కానుంది.