: హైదరాబాదులో మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర... అడ్డుకున్న పోలీసులు


పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై పార్లమెంటులో విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు, మోదీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని ఎల్బీనగర్ సమీపంలోని నాగోల్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, అనంతరం శ్మశానవాటికకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News