: ముంబై ఫర్నిచర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం... బారీగా ఎగసిపడుతున్న మంటలు


ముంబైలోని ఒషివారాలోని ఫర్నిచర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ లోని ఓ షాపులో మంటలు అంటుకున్నాయి. దీంతో అగ్నికీలలు మార్కెట్ మొత్తం వ్యాపించాయి. 10 అగ్నిమాపక శకటాలతో ఈ మంటలను ఆర్పడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. వారికి స్థానికులు, మార్కెట్ సిబ్బంది సహకరిస్తున్నారు. ఈ ఘటనలో ఫర్నిచర్ కాలిపోవడంతో ఆస్తినష్టం భారీ ఎత్తున ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. మంటలు అదుపులోకి వస్తే తప్ప ఎంత ఆస్తినష్టం జరిగిందన్న అంచనాకు రాలేమని పలువురు తెలిపారు.

  • Loading...

More Telugu News