: హిమాయత్ నగర్ పోస్టాఫీసులో అర్ధరాత్రి వరకు సీబీఐ అధికారుల తనిఖీలు


పెద్దనోట్ల రద్దు అంశాన్ని అవకాశంగా తీసుకున్న పోస్టల్ అధికారులు భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రంగప్రవేశం చేసిన సీబీఐ అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. హైదరాబాదులోని హిమాయత్ నగర్ లోని పోస్టాఫీసులో భారీ ఎత్తున జరిగిన పెద్దనోట్ల మార్పిడీపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. గత అర్ధరాత్రి వరకు ఈ పోస్టాఫీసులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 40 లక్షల రూపాయల లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News