: వెయిటర్ పరిస్థితి చూసి చలించిన కస్టమర్.. 17 లక్షల టిప్!


ఏదైనా హోటల్ కి వెళ్తే అక్కడ సర్వర్ మనకి మంచి సర్వీసు అందిస్తే పదో, పరకో టిప్ కింద ఇస్తాము. కానీ ఓ వ్యక్తి 17 లక్షల రూపాయలు టిప్ గా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఉత్తరమధ్య అమెరికాలోని ఓక్లహామ సిటీలో డూడా అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కు లాయర్ అయిన ఫ్రెడ్ అనే వ్యక్తి తన కుమార్తె మెరెడిత్ తో భోజనానికి వచ్చారు. ఈ సందర్భంలో వారికి ఆహారపదార్థాలు సరఫరా చేసేందుకు సర్వర్ గా పని చేసే బ్రియాన్ మైక్స్ నర్ అనే వ్యక్తి వచ్చాడు. వారికి ఆహారపదార్థాలు సర్వ్ చేస్తున్నప్పుడు అతను మూతి ముడుచుకుని ఉండడంతో ఏం జరిగిందని వారు ప్రశ్నించారు. దీంతో బ్రియాన్ తన నోట్లో ముందు వరుస పళ్లు పాడైపోయాయని, అవి తనను బాధిస్తూ ఉంటాయని పంటిబిగువున భరిస్తూ చెప్పాడు. అయినప్పటికీ అతను వారిని ఆకట్టుకోవడంతో... బిల్లు చెల్లించేందుకు రెస్టారెంట్ యజమాని వద్దకు వెళ్లిన ఫ్రెడ్... పంటి నొప్పి బారినుంచి విముక్తి కల్పించేందుకు బ్రియాన్ కు 25 వేల డాలర్లు (17 లక్షల రూపాయలు) టిప్ గా ఇస్తున్నానని తెలిపారు. ఇది విన్న బ్రియాన్ కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. ముక్కూమొహం తెలియని తనకు సహాయం చేయడం మరువలేనని అన్నాడు. దీనిపై మెరెడిత్ మాట్లాడుతూ, తన తండ్రికి ఇది మామూలేనని, సహాయం చేయడంలో తన తండ్రి ముందువరుసలో ఉంటారని చెప్పింది. బ్రియాన్ కి సాయం చేయడం చాలా గర్వంగా భావిస్తున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News