: కోతిని చిత్రహింసలు పెట్టిన నలుగురు మెడికోలపై సస్పెన్షన్ వేటు


తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో కోతిని చిత్రహింసలు పెట్టి చంపి పూడ్చిపెట్టిన నలుగురు మెడికోలపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... వందలాది ఎకరాల్లో ఉండే వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పచ్చదనానికి ప్రతీక. దీంతో అక్కడ కోతుల విహారం ఎక్కువగా ఉంటుంది. ఆహారం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో కోతులు హాస్టల్ పరిసరాల్లో సంచరిస్తుంటాయి. ఈ నెల 19న అలాగే సంచరిస్తున్న ఓ కోతిని రోహిత్‌ కుమార్‌ ఏనుకుట్టి, ఐశ్వర్‌ శామువేల్‌, అరులూవిస్‌, అలెక్స్‌ కలియాల్‌ అనే నలుగురు మెడిసిన్ విద్యార్థులు దుప్పటి ముసుగేసి పట్టేశారు. అనంతరం దానిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో జంతుప్రేమికుల ఫిర్యాదు మేరకు పాతిపెట్టిన దానిని తిరిగి తవ్వి తీసి ఆశ్చర్యపోయారు. అంత దారుణంగా ఆ మూగజీవాన్ని వారు చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై స్పందించిన కళాశాల యాజమాన్యం దర్యాప్తు చేసి, నేరం నిరూపణ కావడంతో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ చర్య సహించరానిదిగా పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News