: బుల్లెట్ నడుపుతూ అభిమానులను అలరించిన నందమూరి బాలకృష్ణ
టీడీపీ సర్కారు నిర్వహిస్తోన్న జనచైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన నియోజక వర్గమయిన హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ వాహనం నడుపుతూ తన అభిమానులను, కార్యకర్తలను అలరించారు. అనంతరం హిందూపురంలో పాదయాత్ర చేసి సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి అనంతపురంలోని చెరువులను నింపుతామని, హిందూపురం పట్టణానికి తాగునీటిని రప్పిస్తామని వ్యాఖ్యానించారు.