: ఎట్టకేలకు రాజ్యసభలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. ఏం చెబుతారో?


వాయిదా తరువాత తిరిగి 12 గంటలకు పార్లమెంటు ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎట్ట‌కేల‌కు నోట్ల ర‌ద్దు అంశంపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌భ‌లో ఉండాల‌ని, తాము చెప్పే అంశాల‌ను విని స‌మాధానం చెప్పాల‌ని విప‌క్షాలు గంద‌ర‌గోళం చేస్తోన్న విష‌యం తెలిసిందే. రాజ్య‌స‌భ‌కు ఈ రోజు మోదీ హాజ‌ర‌య్యారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌సంగిస్తున్నారు. మ‌రోవైపు పెద్ద‌నోట్ల ర‌ద్దుపై లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై విప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు. మోదీ రాజ్యసభలో ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News