: నటుడు సిద్ధార్థ ట్వీట్ తో ఆ యాడ్ ను వెనక్కి తీసుకున్నారు!


భారత దేశ స్త్రీలను కించపరుస్తూ ‘జాక్ అండ్ జోన్స్’ దుస్తుల కంపెనీ రూపొందించిన యాడ్ పై దక్షిణాది నటుడు సిద్ధార్థ మండిపడటంతో ఆ ప్రకటనను సదరు సంస్థ వెనక్కి తీసుకుంది. చెన్నై నగరంలో ఏర్పాటు చేసిన సదరు సంస్థ హోర్డింగ్ లో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ మోడల్ ను తన భుజాలపైకి ఎత్తుకుని వెళ్తూ ఉండగా, మహిళలను కించపర్చే విధంగా ఇంగ్లీషు భాషలో ఒక క్యాప్షన్ రాసి ఉంటుంది. దీనిపై స్పందించిన హీరో సిద్ధార్థ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సదరు సంస్థ.. ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని, వెంటనే ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. కాగా, సిద్ధార్థ వ్యాఖ్యలకు నెటిజన్ల మద్దతు కూడా లభించింది. ఈ ప్రకటనను ‘జాక్ అండ్ జోన్స్’ సంస్థ వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News