: వ్యవసాయ భూములపై సంపద పన్ను లేదు: చిదంబరం
వ్యవసాయ భూములపై సంపద పన్ను విధించే యోచనేదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. లోక్ సభలో ఆర్థిక బిల్లు ఆమోదం సందర్భంగా సభ్యుల ప్రశ్నకు మంత్రి ఇలా వివరణ ఇచ్చారు. వాస్తవానికి పట్టణాలకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే వ్యవసాయ భూములపై 1శాతం సంపద పన్ను విధించాలనే ప్రతిపాదనను మంత్రి చిదంబరం ఇంతకుముందు తీసుకొచ్చారు. తాజాగా సంపద పన్ను విధింపు లేదంటూ ఇచ్చిన వివరణతో రైతులకు ఊరట లభించింది.