: సీఎంఎస్-సీఏ అకాడమీలో తనిఖీలు...6 లక్షల రూపాయల కొత్త నోట్లు స్వాధీనం


హైదరాబాదులోని ఎస్‌ఆర్‌ నగర్‌ లోని సీఎంఎస్‌-సీఏ అకాడమీలో కేంద్ర సేవాపన్ను డిప్యూటీ కమిషనర్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఈ సంస్థ సేవాపన్ను చెల్లించడం లేదని గుర్తించిన సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సీఎంఎస్‌-సీఏ అకాడమీ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదు. దీంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎంఎస్‌-సీఏ అకాడమీ నుంచి మొత్తం 13 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా, అందులో 6 లక్షల రూపాయల విలువ కలిగిన కొత్త 2 వేల రూపాయల నోట్లను అధికారులు గుర్తించారు. దీంతో 2 వేల రూపాయల నోట్లపై నిబంధనలు ఉండగా, ఇంత పెద్ద మొత్తంలో కొత్త 2 వేల రూపాయల నోట్లు ఎలా వచ్చాయని ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News