: టీడీపీ కార్పొరేటర్లపై మండిపడుతూ దుర్భాషలాడిన వైసీపీ ఎమ్మెల్యే


ఈ రోజు జరుగుతున్న కడప కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో గందరగోళం నెలకొంది. టీడీపీ కార్పొరేటర్లపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా మండిపడుతూ వారిని బూతులు తిట్టారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో పాటు వచ్చిన ఆయన.. సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు పలు అంశాలకి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ విధంగా దుర్భాషలాడారు. సమావేశంలో రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరుపై టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News