: చందన బ్రదర్స్ యజమాని రామారావు అరెస్ట్
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ చందన బ్రదర్స్ యజమాని రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫోర్జరీ కేసులో ఆయనను హైదరాబాదు ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సంతకాన్ని రామారావు ఫోర్జరీ చేశారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, గుంటూరులో కన్నా ఫణీంద్ర, రామారావుల మధ్య భూ వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.