: కేసీఆర్ దగ్గర బ్లాక్ మనీ ఎంతుందో త్వరలోనే తెలుస్తుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అతిపెద్ద అవినీతిపరుడుగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఆయన వద్ద ఎంత బ్లాక్ మనీ ఉందో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. నల్లధనాన్ని మార్చుకునే క్రమంలోనే ప్రధాని మోదీని కేసీఆర్ కలిశారని... మోదీ, కేసీఆర్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువస్తానని చెప్పిన మోదీ విఫలమయ్యారని... ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News