: మెరుపు దాడులకు పాక్ సైన్యం సిద్ధం.. ప్రతీకారం భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తూ రంగంలోకి దిగిన భారత ఆర్మీ
జమ్ముకశ్మీర్ లోని మచ్చిల్ సెక్టార్ లో నిన్న కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ ఉగ్రవాదులు ముగ్గురు భారత జవాన్ల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో పాకిస్థాన్ మరోసారి మెరుపు దాడులకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని తెలుసుకున్న భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎదురు దాడులు చేపట్టింది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరి, ఖేల్, మచ్చిల్ ప్రాంతాల్లో సైన్యం సోదాలు నిర్వహిస్తోంది. నిన్న భారత సైన్యంపై దాడులు జరిపిన పాక్ చర్యను ఓ పిరికిపంద చర్యగా భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక స్థావరాలపై కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ రేంజర్లపై తీసుకుంటున్న చర్య భయంకరంగా ఉంటుందని ఆర్మీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.