: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మూడు రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతానని హెచ్చరించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న ఆమె.. కొద్ది సేపటిక్రితం తమ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ధర్నా ప్రారంభించారు. ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోన్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు.