: గ్రామ‌స్తులంతా క‌లిసి బ్యాంకుకు వెళ్లారు.. అంద‌రూ డ‌బ్బు తీసుకొని ఓ జంట పెళ్లి జ‌రిపిస్తున్నారు!


పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరతతో దేశంలో ఎన్నో ఫంక్ష‌న్లు ర‌ద్దయ్యాయి. నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను కొనుక్కోవ‌డానికి కూడా కొంద‌రికి డ‌బ్బు దొరకడం లేదు. ఇక పెళ్లి వేడుకకు ముహూర్తం ఖాయం చేసుకున్న కుటుంబాల బాధ‌లు వర్ణనాతీతం. పెళ్లి కార్డులు ప‌ట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ క‌నిపిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌లోని కోలాపూర్లో ఈ రోజు ఓ వివాహం జ‌ర‌గాల్సి ఉంది. అయితే, వివాహ వేడుక జ‌రిపించ‌డానికి కేవ‌లం పెళ్లి కొడుకు, కూతురి కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే కాదు.. గ్రామ‌స్తులంతా కష్టప‌డ్డారు. సయాలి అనే బీఏ బీఈడీ విద్యార్థినికి, ఓ షాపు యజమానికి ఈ రోజు వివాహం జ‌రుగుతోంది. పెద్ద‌మొత్తంలో ఒకేసారి బ్యాంకు నుంచి డ‌బ్బు తీసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డ‌తో గ్రామస్తులంతా కలిసి బ్యాంకుల ముందుకు చేరుకొని వారి పెళ్లి కోసం త‌మ త‌మ ఖాతాల నుంచి తలా కొంచెం డబ్బులు తీసుకున్నారు. ఆ డ‌బ్బుని పెళ్లి కోసం వినియోగిస్తున్నారు. వారంద‌రి సాయంతో పెళ్లి ముహూర్తం ప్ర‌కారం జరుగుతోంది. త‌న పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జ‌రుగుతున్నందుకు పెళ్లికూతురు ఆనందం మిన్నంటింది.

  • Loading...

More Telugu News