: రేపు బీసెంట్ నగర్ లో మంగళంపల్లి పార్థివదేహానికి అంత్యక్రియలు
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్థివ దేహానికి రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చైన్నైలోని బీసెంట్ నగర్ లో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. ఇదిలా ఉంచితే, ఈ నెల మొదట్లో ఆయన అనకాపల్లిలో సన్మానానికి వెళ్లి వచ్చారు. నలతగా ఉందని రెండు రోజులుగా ఇంటికి పరిమితమైన బాలమురళీకృష్ణ నేడు అనంతలోకాలకేగారు. ఆయన మృతికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.