: సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటోకు ‘సూపర్.. కేక’ అంటూ ప్రశంసలు!
నాగ చైతన్యతో కలిసి ఉన్న ఒక ఫొటోను దక్షిణాది ముద్దుగుమ్మ సమంత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. కూలింగ్ గ్లాసెస్ ధరించిన వీళ్లిద్దరూ, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుతూ, ప్రేమను ఒలకబోసుకుంటున్న ఈ ఫొటోపై నెటిజన్లు స్పందించారు. ‘సూపర్.. కేక అన్న’ అని ఒకరు, ‘చిత్ర పరిశ్రమలోనే బెస్ట్ కపుల్’ అని మరొకరు, ‘లవ్ బర్డ్స్’, ‘అసూయ పుడుతోంది’ అంటూ ఇంకొందరు నెటిజన్లు స్పందించారు. కాగా, రేపు నాగ చైతన్య పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే త్వరలో పెళ్లిచేసుకోనున్న ఈ జంట గోవా వెళ్లినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.