: తిండిపోటీల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి!
ఇటీవల నిర్వహించిన తిండిపోటీల్లో పాల్గొన్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మరణించిన ఘటన జపాన్లోని హికోన్ నగరంలో చోటుచేసుకుంది. పోటీలో భాగంగా అన్నం ముద్దలను ఎవరు తొందరగా తింటే వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే, ఈ క్రమంలోనే వేగంగా అన్నం ముద్దలు తిన్న ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనిని గమనించిన నిర్వాహకులు వెంటనే ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన ఆ యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఆ దేశంలో ఇటువంటి తిండి పోటీలు తరచూ నిర్వహిస్తుంటారు. వేగంగా తింటే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.