: దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌కు మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత
బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌కు జరినామా విధిస్తున్నట్లు ఈ రోజు ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో నిబంధనలు ఉల్లంఘిస్తూ సదరు క్రికెటర్ ఈ చర్యకు పాల్పడ్డాడని ఐసీసీకి ఫిర్యాదులందడంతో స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. డుప్లెసిస్ కి తన మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. అయితే, ఎల్లుండి నుంచి ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఆడనున్న మూడో టెస్టు మ్యాచ్ లో మాత్రం డుప్లెసిస్ ఆడవచ్చని ఐసీసీ తెలిపింది.