: రకుల్ ప్రీత్ సింగ్ కి ఐటీ నోటీసులు?


ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఐటీ శాఖ నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్, బీజేపీ మాజీ ఎంపీ గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాహానికి చేసిన ఖర్చుపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 30 కోట్ల రూపాయలతో దీనిని నిర్వహించామని వెడ్డింగ్ నిర్వాహకులు తెలపగా, 500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాహానికి ఎంత ఖర్చైంది? అన్న వివరాలను నిగ్గుతేల్చేందుకు ఐటీ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా ఈ వివాహంలో ఆడిపాడిన వారందరికీ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా నోటీసులు పంపినట్టు సమాచారం. అయితే తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని రకుల్ చెబుతోంది.

  • Loading...

More Telugu News