: ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు వాయిదా


ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ రోజుతో ఈ కేసులో వాదనలు ముగిశాయని హైకోర్టు తెలిపింది. అయితే, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలుమార్లు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, ఆళ్ల తరపున సీనియర్ అడ్వొకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News