: చంద్రబాబు వద్దకు చేరిన చౌదరి, జేసీ పంచాయతీ


అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీల మధ్య పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. అనంతపురంలోని గాంధీ రోడ్డు, తిలక్‌ రోడ్డు విస్తరణకు సంబంధించి ఆక్రమణల తొలగింపు, భూసేకరణపై నిన్న వివాదం రేగిన సంగతి తెలిసిందే. మున్సిపల్ కమిషనర్, నగరపాలక సంస్థ మేయర్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ, విస్తరణ పనులు కొనసాగనివ్వాలని డిమాండ్ చేస్తూ జేసీ దివాకర్ రెడ్డి ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఆయన ధర్నాకు దీటుగా స్థానికులు రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం అనంతపురంలో కాకరాజేసింది. దీనిపై ఇద్దరూ సీఎంకు ఫిర్యాదు చేయడంతో, తనను కలవాలని సీఎం వారిని ఆదేశించారు. దీంతో ప్రభాకర్ చౌదరి ఆయనను కలిశారు. జరిగిన ఘటనను సీఎంకు వివరించారు.

  • Loading...

More Telugu News