: ఐదు సలహాలిస్తే, రెండే పాటించారు: నోట్ల రద్దుపై మోదీకి సలహా ఇచ్చిన బోకిల్
అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ గుర్తున్నారా... పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఈయనే సలహా ఇచ్చారు. నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న గందరగోళంపై తాజాగా ఆయన స్పందించారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి తాను సమగ్రమైన ప్రణాళికను అందించానని... రద్దు అంశాన్ని ఎలా అమలు చేయాలో క్లియర్ గా తెలిపానని ఆయన అన్నారు. తాను ఐదు సలహాలు ఇస్తే... ప్రభుత్వం మాత్రం రెండు సలహాలను మాత్రమే పాటించిందని చెప్పారు. తమ సంస్థ అందజేసిన రోడ్ మ్యాప్ ను యథాతథంగా అనుసరించినట్టైతే... ఇంత గందరగోళం చెలరేగేది కాదని ఆయన అన్నారు. మరోవైపు, ఈయన మరోసారి మోదీని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.